ఒలికించ గలదు మధువును మురుగు వాడల వెంట
నెలకొల్పగలదు కలలను, కల్లను సైతం నిజముగ
చలగాటమాడగలదు చెలిమి తోటి కలిమి
చలగాటమాడగలదు చెలిమి తోటి కలిమి
అలరించగలదు ఆలిని కోల్పొయిన వానిని
తలపులను తారుమారు సేయ గలదు రొక్కము
విలుచగలదు విత్తము గెలుపును , విద్యను
సులువుగ తెంపగలదు బంధపాశములను
నలుపగలదు నరుల నాజూకు మనసును నగదు
కొల్లలైన తల్లడిపాట్లు తెచ్చు రూకలకై ఉరుకులేల? పరుగులేల?

5 comments:
very good,keep it up
Thank you!.. Is this N Manjula from MPL?
good judgement abt. money and good understanding
"కలదంటిరి బ్యాంకుల యెడ
కలదంటిరి కంపనీల గణముల పాలన్
కలదంటి రమెరికాలో
కలదు కలదనెడు డబ్బులు కలవో! లేవో!"
జనాల ఆలొచన లిలా ఉంటూండగా రూకలేల అన్నారుచూడండి అది నాకు నచ్చింది
Dhanyavaadamulu!
Post a Comment