?
జీవిత ప్రబంధాన ఎంతటి అవసరం ఈ స్కంధం?
ఎటువంటిది ఈ బంధం,అనుబంధం?
తుమ్మెదకు,సుమవర్ణమునకు, ఉన్నట్టిదా?
అరవిందమునకు ,రవికి ఉన్నట్టిదా?
జలమునకు,మత్స్యమునకు ఉన్నట్టిదా?
భూజమునకు,మనుజునకు,ఉన్నట్టిదా?
జలఝరికి,తెరువరికి ఉన్నట్టిదా?
అనుపమానమైనదని అనుసరింతుమా?
ఉత్తరం తెలియని ప్రశ్న అని తుడిచి వేతుమా?
పోలిక లేని బంధమని తేలికగా విడిచి వేతుమా?