Wednesday, April 16, 2008

ద్రవము ఉపద్రవము

పలికించగలదు పచ్చనోటు పలుకజాలని వానిని
ఒలికించ గలదు మధువును మురుగు వాడల వెంట
నెలకొల్పగలదు కలలను, కల్లను సైతం నిజముగ
చలగాటమాడగలదు చెలిమి తోటి కలిమి
అలరించగలదు ఆలిని కోల్పొయిన వానిని
తలపులను తారుమారు సేయ గలదు రొక్కము
విలుచగలదు విత్తము గెలుపును , విద్యను
సులువుగ తెంపగలదు బంధపాశములను
నలుపగలదు నరుల నాజూకు మనసును నగదు
కొల్లలైన తల్లడిపాట్లు తెచ్చు రూకలకై ఉరుకులేల? పరుగులేల?