ప్రస్థానం అను తెలుగు చలన చిత్రం చూసి స్పందించిన అడుగు..
మృగమై పుట్టుట మేలు కదాచేసేది తప్పని ఎరుకుండదు
మనిషై పుట్టి సుఖమేది దొర
తప్పుల కుప్పలకంతుండదు
తప్పులు కప్పి మెప్పులు రాగా
ముప్పులనాపి నొప్పులు పోగా
తప్పే ఒప్పని చెప్పే మనిషికి
నిక్కపు నిప్పును ఎదిరించే వీర్యం
బొంకను కప్పును విరిచే ధైర్యం
పక్కకు తోక్కక నిలిచే స్థైర్యం
పట్టెడు విలువలకిచ్చే మాన్యం
కించిత్తైన ఉండక పోతే...
తప్పే ముప్పని తెలిసిన మనిషికి
ఒప్పో తప్పో తెలియని పశువుకి
అవధులు మాపి దూరాలు చెరిపి
వంతెన కట్టి, మ్రుగీకరణకు నాందులు పలికే
అసమానమైన అణువు ఆయుధాలే ఆశ, అహం,అంధకారం