క్లేశాబ్ది యందు మునకలు వేస్తూ, చేతలు పాలుపోకచూడ సాగితిని శూన్యమును,పొద్దు పొడవకనే ఒకనాడు
తిమిరమును ఛేధించె రజత కిరణములు
కెంపు వర్ణపు అంబరమును అలంకరించె
మేలిమి స్వర్ణపు బంతి వంటి సూర్యుడు
ఉదయించెను దినకరుడు వెలుగును వెదజల్లుతూ
కనిపించెను ఒక మేఘము కపిరాజు వలె
అనిపించెను మరొక మేఘము కరిరాజు వలె
చివాలున మారెను అవి రెండు కుసుమ గుఛ్ఛము వోలె
బోధపడెను దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిదన్న తత్వము
గోచరించెను చెంతనున్న చింత చేయూత వలె
అనుసరించెను ఆత్మస్థైర్యము అట్టి ఆలొచనను
మనోహరమైన ఈ ఉషస్సు చేకూర్చె స్పష్టతను మనస్సుకు
ధరనేలు ధైర్యము సమకూరె అరువివ్వ తగినంత
ధరనేలు ధైర్యము సమకూరె అరువివ్వ తగినంత
No comments:
Post a Comment