Saturday, March 1, 2008

లతాంతముల వృత్తాంతము

నరుని సృష్టికి మునుపు నలువ
తీక్షణమైన యోచన యందు పడెను!
మహిని మరింత రమ్యముగ మలచుటకు,
ఇసుక బైళ్ళ పై హరిత తివాచి నేచెను
దట్టమైన వనములను,నెట్రమైన నగములను
సెలయేళ్ళను, హరి విల్లును, వెండి కొండలను
నిటారు మానులను, అటు సరసనే సరస్సులను
నిర్మించెను నిర్విరామముగా,
చక్కదనము చేకూర్చెను మెరుగులు దిద్ది,
పిదప కానవచ్చెను ఉర్వియందు దాగిన లోటు
చెక్కెను ఓ మృదువైన రూపమును
టక్కున దాల్చె చిత్రకారుని వేషమును విధాత
రంగరించెను వివిధ వర్ణములను
చే పట్టెను అందు ముంచిన కుంఛెను
చిత్రీకరించెను కుసుమములను అనేక తీరులయందు
అట్లు చేకూరెను పుడమికి పరిపూర్ణత ప్రసూనము చేత
ముస్తాబయ్యెను ఉర్వి మానవుని రాక కొరకు

No comments: