Tuesday, July 29, 2008

రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్
బహు బాగుగనున్న భాగ్యనగరమున
నైజాం నైజం తెలిపెడి కోటలు
శాంత స్వరూపుడు ట్యాన్క్ బండ్ బుద్ధుడు
చక్కగ చెక్కిన చార్మినారు
మిల మిల మెరిసెడి అద్దాల మేడలు
జిలుగుల సొబగుల అందాల భామలు
ముత్యాలు,గాజులు, ఇంతుల గంతులు
లొట్టలు వేసెడి బిర్యాని ప్రియులు
కలుగుల వంటి సరుకుల కొట్టులు
గతుకులు నిండిన విశాల రోడ్డులు
వాడల పేర్లలొ కొండలు,గుట్టలు
హద్దులు మీరిన వీధిన రద్ది
క్రమమే ఎరుగని నిర్లక్ష్య జనులు
ఇలాంటి సందడి నిండిన నగరిలొ
తేట తెనుగు కాన రాదు తెరపి లేక వెతకినను
అయ్యా అను వారు లేరు "భైయ్య" అను వారు బోలెడు
ఆంధ్ర రాజధాని యందు అగుపడదు ఆంధ్రభాష
అక్కటా! అచ్చ తెలుగు మెచ్చువారి సంఖ్య హెచ్చు విధము లేదా?

1 comment:

క .వేం. సుబ్రమణ్యం said...

తెలుగు వ్రాయుట రాదు తెలుగు చదువుట రాదు
ఆంగ్ల భాష ప్రావీణ్యుడను నేను
తెలుగు రాని నేను తెలివి తక్కువని కాను
బాబు గారి హైటెక్ బుడుగు నేను

అని ప్రజలు సగర్వం గా చెప్పుకు తిరుగుతున్న ఈ మహనగరం లో తెలుగు కోసం పరితపిస్తూ ఆర్ద్రతతో నువ్వు రాసిన కవిత చాలాబాగుంది .