Saturday, May 24, 2008

భీకరం----భయంకరం

మారణ హోమము - మా రణ ఆశయము
మానవ దహనము- మా నవ ధ్యేయము
ఇది మా ద్వేషానికి, ఆవేశానికి దర్పణము
విశ్వాంతానికి మేమొనర్చిన అంకుర అర్పణము
భీకరం భయంకరం అకారణం అమానుషం
హింసా ఖాండకు, విధ్వంస చర్యకు
రాలిన తనువుల నిర్దోషత్వం కారణమా?
మీ కోరికలను తీర్చుకోనేందుకు మార్గము ఇంతటి దారుణమా?
శశ్య శ్యామలమైన ప్రపంచం
ప్రేమతొ నిండిన బంగరు లోకం
కలతలు లేని శాంత సమాజం
కావాలి ఇప్పుడు మీ స్వప్నం
అవ్వాలి సఫలం మీ యత్నం
మారాలి అవని సుందరం నిరంతరం

No comments: