Tuesday, July 30, 2013

అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప, హీరోలు విల్లన్లు లేరీ జగన్నాటకంలో!





తల్లి గుండెలను చీల్చిన చిరుతలు 
జంకక బొంకి  రంగులు మార్చిన  ఊసరవిల్లులు 
అమాయకుల ప్రాణాలు విందుగ చేసుకొన్న రాబందులు 
సోదరుల మధ్య కలహం  రేపిన గుంట నక్కలు
చిందులు వేసిన మీడియా మందలు

పన్నారు వారు రాజకీయ పథకం
మదించుకొన్నారు వారి లాభం నష్టం     
చేసారు రాష్ట్రాన్ని ముక్క చెక్కలు 
వేసుకొన్నారు వారి ఆస్తుల లెక్కలు
వీరా నాయకులు? కాదు కాదు.. వీరే సమైక్య ఘాతకులు 
ఇదేనా ప్రగతికి పునాది? లేదు లేదు... ఇదే భవితకు సమాధి!


3 comments:

Subramanyam K.V. said...

పవిత్ర గారూ, మీ ఆవేదనను అర్థం చేసుకోగలుగుతున్నా, ఇంత అనుబంధం పెంచుకున్న తరువాత విభజన అంటే కష్టమే. కానీ వాస్తవానికి ఇది మనకి మరో విధంగా మంచి చేసే విషయమే మన ఊళ్ళు బాగుపడతాయండి. అభివృధ్ధి వికేంద్రీకరింపబడుతుంది. దానికి మనం సంతోషించాలి, సమైక్యాంధ్ర లో మాత్రం మన జిల్లాలు బాగుపడ్డాయా ? అసలు ఉపాధి అంటే మనరాష్ట్రం లో హైదరబాదే గా. ఈ పరిస్థితులు ఇలా కొనసాగడం కన్నా విభజన జరిగి మన ప్రాంతాలు బాగుపడడం మంచిదే .
ఇహా భావోద్వేగాల విషయం అంటారా, ఇదో విచిత్రమైన ఇబ్బంది. మనం తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనుకుంటున్నాం కొందరెమో తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది అనుకుంటున్నారు.

ఆ భగవంతుడు తెలుగు వారికి సద్బుధ్ధి ప్రసాదించాలని కోరుకుంటూ
సుబ్రమణ్యం

Subramanyam K.V. said...
This comment has been removed by a blog administrator.
Pavithra V S said...

సుబ్బు గారు,
మనకు ఆశావాదులుగా జీవించడం అలవాటయ్యింది కాబట్టి ఈ విభజన ఇరు రాష్ట్రాల(ప్రాంతాల) అభివృద్ధి గురించేనని జీర్ణించుకోవాలి తప్ప, నిజంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలంటే, విభజనే అవసరం లేదు కదండి. మన నాయకులు చేసిన పొరపాట్ల పరిణామాలు మనవి కాక తప్పవు కదా. మీరన్నట్టు ఈ విభజన అభివృద్ధికే తీయాలని కోరుకొందాం .